'ఫిర్యాదుదారులు లేకుండా విచారణ సరికాదు'

'ఫిర్యాదుదారులు లేకుండా విచారణ సరికాదు'

ASR: కొయ్యూరు(M) యూ.చీడిపాలెం పంచాయతీ ఈదులబందలో అంగన్వాడీ కార్యకర్తలు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని సర్పంచ్ దడల రమేశ్ తెలిపారు. దీనిపై గత నెలలో స్థానికులతో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. కలెక్టర్ ఆదేశాలతో ICDS, CDPO శుక్రవారం గ్రామంలో విచారణ జరిపారు. ఈ విషయంపై ఫిర్యాదుదారులకు, సర్పంచ్‌కు కనీస సమాచారం ఇవ్వలేదని, వెంటనే పునర్విచారణ జరపాలని కోరారు.