కొత్త ఈ-పాస్ యంత్రాలను పంపిణీ చేసిన ఆర్డీవో

కొత్త ఈ-పాస్ యంత్రాలను పంపిణీ చేసిన ఆర్డీవో

NLR: నెల్లూరు ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం నెల్లూరు ఆర్డీవో అనూష రేషన్ షాప్ డీలర్లకు కొత్త ఈ-పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. తొలుత ఆమె సాంకేతిక సిబ్బందితో కలిసి యంత్రాల వినియోగ విధానాన్ని పరిశీలించారు. ఆర్డీవో మాట్లాడుతూ.. ప్రజలకు ఎంతో పారదర్శకంగా, వేగవంతంగా సేవలందించేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో షఫీ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.