చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

MLG: కన్నాయిగూడెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు యాట సాంబయ్య(66) లక్నవరం చెరువులో చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. చేపల వేటకు వలలు వేస్తున్న క్రమంలో కాళ్లకు వలలు చుట్టుకుని ప్రమాదం జరిగిందని, మృతదేహాన్ని ములుగు ఏరియా హాస్పిటల్‌కు తరలించనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.