పెంబిలో విషాదం.. రైతు ఆత్మహత్య
NRML: భారీ వర్షాలకు పత్తి, పసుపు పంట దెబ్బతినడంతో మనస్తాపం చెంది పెంబి మండలం మందపల్లి గ్రామానికి చెందిన రైతు బొమ్మెన పెద్దులు(51) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై హన్మాండ్లు తెలిపారు. పెద్దులు తన రెండెకరాల పొలంలో పత్తి, పసుపు సాగు చేశాడన్నారు. అయితే వర్షాలకు పంట దెబ్బతిన్నడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.