తాగి, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దు

NLR: గూడూరు డీఎస్పీ గీతా కుమారి రోడ్ సేఫ్టీ అవగాహనలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా, చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై స్పీడ్ గన్‌తో వాహనాల వేగాన్ని పరీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. జాతీయ రహదారులపై ప్రమాదాలకు మూల కారణం అతివేగంతో పాటు తాగి వాహనాలు నడపడం, సెల్ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం లాంటి రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడమేనని తెలిపారు.