పుట్టింటి నుంచి భార్య రావడం లేదని భర్త ఆత్మహత్య

పుట్టింటి నుంచి భార్య రావడం లేదని భర్త ఆత్మహత్య

SDPT: పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం గజ్వేల్ మండలం పరిధిలోని రిమ్మనగూడలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎన్నెల్లి కిషన్(26) భార్య కాపురానికి రాలేదని మనస్థాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.