‘ఆకెప్పెల్లి లక్ష్మణ్ మరణం బాధాకరం’
ADB: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకెప్పెల్లి లక్ష్మణ్ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోస్టుమార్టం నిమిత్తం బోథ్ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న భౌతిక దేహాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆడే గజేందర్ పరిశీలించారు. పోలీస్ శాఖ పంచనామా పూర్తి చేయించి, వైద్యులచే పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగ్రామం తలమద్రికి తరలించారు.