ఏలూరులో 'డ్రగ్స్ వద్దు బ్రో' కార్యక్రమం
ELR: సి.ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో మంగళవారం డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే హానికర ప్రభావాల గురించి అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్రరావు అవగాన కల్పించారు. మత్తు పదార్థాలు జీవితాన్ని నాశనం చేసి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయన్నారు. చదువుపై దృష్టి సారించాలన్నారు.