గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పై ఎమ్మెల్యే ఆగ్రహం

గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పై ఎమ్మెల్యే ఆగ్రహం

MHBD: పట్టణ కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలను గురువారం ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రిన్సిపల్ పై మండిపడ్డారు. పాఠశాలలో ఎందుకు శుభ్రం చేయడం లేదని ప్రశ్నించారు. తమ ఇల్లు అయితే ఇలానే ఉంచుతారా అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంటే ఇంత నిర్లక్ష్యం సరికాదని హెచ్చరించారు.