కారు, RTC బస్సు ఢీ.. పలువురుకి గాయాలు
NGKL: వెల్దండ (M) నారాయణపూర్ గేటు సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగినది. హైదరాబాదు నుంచి కల్వకుర్తి వైపు వస్తున్న కారు అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన RTC బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురితో పాటు బస్సులో ఉన్న పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.