'దరఖాస్తులతో రూ.10 లక్షల ఆదాయం'
CTR: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని 56 పోస్టులకు గత నెల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం దరఖాస్తులు 2,093 వచ్చినట్లు DMHO సుధారాణి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ఫీజుతో తమ శాఖకు రూ.10.46 లక్షల ఆదాయం వచ్చిందన్నారు.