VIDEO: పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తం
TG: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. సూరంపేట, గంగారాం తండా అటవీ ప్రాంతాల్లో రెండు ఆవులపై పులి దాడి చేసి చంపింది. ఈ దృశ్యాలు ట్రాక్ కెమెరాల్లో రికార్డు కావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇన్ఫెక్షన్లు సోకకుండా ఆవుల కళేబరాలను దహనం చేశారు. పొలాలకు, అడవిలోకి ఒంటరిగా వెళ్లొద్దని అధికారులు ప్రజలకు, పశువుల కాపారులకు సూచించారు.