నేడు సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి నియోజకవర్గంలో శుక్రవారం ఎమ్మెల్యే మట్ట రాగమయి పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు. కల్లూరు, తల్లాడ, సత్తుపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కావున ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు గమనించాలని పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.