పోలీసులకు ఫైరింగ్‌పై శిక్షణ
ATP: జిల్లా ఎస్పీ పీ. జగదీష్ ఆదేశాల మేరకు సివిల్ పోలీసులకు వార్షిక ఫైరింగ్‌పై శిక్షణ నిర్వహించారు. ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నీల రేంజ్‌లో కానిస్టేబుల్ నుంచి ఏఎస్సైల వరకు ఈ సాధనలో పాల్గొన్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా పర్యవేక్షణలో అర్బన్, రూరల్ విభాగాల సిబ్బందికి 410 మస్కెట్, 9 ఎంఎం పిస్టల్స్‌తో శిక్షణ ఇచ్చారు.