రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు: మైనార్టీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 25 తేదీ వరకు గడువుందని పుంగనూరు పురపాలక కమిషనర్ మధుసూదనరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పురపాలకకు 74 యూనిట్లు మంజూరయ్యాయని, ముస్లిం, క్రిస్టియన్, బుద్దీస్, సిక్కు జైన, పార్సీ వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రేషన్, ఆధార్, కులం, జనన ధ్రువపత్రాలతో పాటు మొబైల్ నంబర్ ఇవ్వాలన్నారు.