VIDEO: నిత్యవసర సరుకులు, నోటు పుస్తకాలు అందజేత
కృష్ణా: సీఎం చంద్రబాబు 76వ జన్మదినం సందర్భంగా కంకిపాడు మండలం టీడీపీ సీనియర్ నేత యలమంచిలి కిషోర్ బాబు నిత్యవసర సరుకులు, విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫామ్లను ఆదివారం అందజేశారు. సమకాలీన రాజకీయాల్లో అపార రాజకీయ దూరదృష్టి కలిగిన నేత, వినూత్న ఆలోచనలకు మార్గదర్శకుడు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండే నేత చంద్రబాబు అని కిషోర్ బాబు అన్నారు.