మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆహ్వానించిన అధికారులు
NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి శరన్నవరాత్రులు ఈనెల 22 నుంచి అక్టోబర్ రెండు వరకు వైభవంగా జరగనున్నాయి. శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ పీవీ కుమార్ రెడ్డి కలిసి శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఆహ్వాన ప్రత్రికను అందజేశారు. అనంతరం వారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని పూలమాలతో సత్కరించారు.