గడ్డిమందుపై నిషేధం.. జీవో 24 విడుదల
TG: రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందుపై నిషేధం విధించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో 24 విడుదల చేసి, ఈ మందు తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకాలను చట్ట విరుద్ధంగా ప్రకటించింది. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సదరు మందు తక్కువ మోతాదులో ఉపయోగించినా శరీర అవయవాలకు హాని కలిగిస్తుందని, కూరగాయలు విషపూరితంగా మారుతాయని వ్యవసాయ శాఖ గుర్తించింది.