నేడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న MLA
నంద్యాల పార్లమెంట్ ఇంఛార్జీ మాండ్ర శివానంద రెడ్డి, నంది కోట్కూరు ఎమ్మెల్య గిత్త జయసూర్య నేడు ఉ.10.00 గంటలకు బ్రాహ్మణ కోట్కూరు పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. అనంతరం 11.00 గంటలకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఛైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. ఈ మేరకు నాయకులు, కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.