ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య
NTR: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విజయవాడ శివారు పైడూరుపాడులో శుక్రవారం రాత్రి కవిత అనే మహిళ తన ఇద్దరు పిల్లలు లాస్య, సాత్విక్లకు ఉరివేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. గత ఐదేళ్లుగా కవిత వింతగా ప్రవర్తిస్తునట్లు స్థానికులు తెలిపారు. ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.