VIDEO: చింతగట్టు బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ జామ్
HNK: హసన్‌పర్తి మండలం చింతగట్టు క్యాంపు సమీపంలోని బ్రిడ్జి వద్ద సోమవారం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతి సెలవులు ముగియడం, పాఠశాలలు పునఃప్రారంభం కావడం, కార్యాలయాలకు వెళ్లే వాహనాలు పెరగడంతో వాహనాలు నిలిచిపోయాయి. హసన్‌పర్తి నుంచి కేయూ జంక్షన్ చేరుకోవడానికి గంటకు పైగా సమయం పడుతోంది. అయితే ట్రాఫిక్ పోలీసులు లేకపోవడం గమనార్హం.