ఉద్యాన పంటలపై రైతులకు శిక్షణ కార్యక్రమం

ఉద్యాన పంటలపై రైతులకు శిక్షణ కార్యక్రమం

BHPL: చిట్యాల మండలం గుంటూరుపల్లిలో సోమవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉద్యాన పంటల సాగుపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగు ద్వారా తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం, దీర్ఘకాలిక లాభాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో AO శ్రీనివాస్ రెడ్డి, ఉద్యాన విస్తరణ అధికారి రామాచారి ఉన్నారు.