మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన తహసీల్దార్
SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు మధ్యాహ్న భోజన పథకాన్ని తాహసీల్దార్ రామకృష్ణ రెడ్డి పరిశీలించారు. కేజీబీవీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి రోజు పౌష్టికాహారం అందిస్తున్నారా లేదో తెలుసుకున్నారు. అలాగే వంటగది, కూరగాయలను నిల్వ చేసే గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.