పాము కాటుకు వ్యక్తి మృతి
WNP: పెబ్బేరు మండలం సూగురు గ్రామంలో పాము కరిచి ఓ వ్యక్తి మృతి చెందాడు. సూగురు గ్రామానికి చెందిన కుమ్మరి జయ రాములు (44) సోమవారం మధ్యాహ్నం పొలం పని చేసి తిరిగి వస్తుండగా తాచుపాము ఎడమ కాలుపై కాటేసింది. వెంటనే భార్య పద్మావతి స్థానికుల సహాయంతో అతనిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే జయ రాములు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.