ఉర్సుగుట్ట జంక్షన్‌లో 'అరైవ్ అలైవ్' కార్యక్రమం

ఉర్సుగుట్ట జంక్షన్‌లో 'అరైవ్ అలైవ్' కార్యక్రమం

WGL: నగరంలోని ఉర్సుగుట్ట జంక్షన్‌లో 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రతా కార్యక్రమాన్ని బుధవారం ఉదయం నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద, అడిషనల్ కలెక్టర్ విజయ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతీరావ్ పూలే పాఠశాల విద్యార్థులు ర్యాలీగా ఉర్సుగుట్ట వద్దకి వచ్చారు. అనంతరం 600 మందితో మహా మానవహారం నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.