'పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత'
HNK: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. హనుమకొండ 56వ డివిజన్ గోపాలపురం చెరువు సమీపంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. 99 రోజులపాటు నిర్వహించబోయే ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు.