'గణిత నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలి'
గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కొండేరు ZPHSను ఇవాళ రాష్ట్ర పరిశీలకులు మధుసూదన్ రెడ్డి సందర్శించారు. మౌఖిక భాష, గణిత నైపుణ్యాలను విద్యార్థులకు అందించవలసిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉన్నదని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం వంటి భాషా నైపుణ్యాలు కూడికలు, తీసివేతలు ప్రాథమిక దశలో అందించి బలమైన పునాది వేయాలన్నారు.