'నేడు మండల కేంద్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ'
VKB: దుద్యాల మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం దగ్గర ఈరోజు చేప పిల్లలు పంపిణీ చేయనున్నారు. మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉదయం 11 గంటలకు పంపిణీ చేయనున్నామని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఆవుటి శేఖర్ తెలిపారు. మండల పరిధిలోని మత్స్య సహకార సంఘం సభ్యులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.