VIDEO: డీస్ ప్లే బోర్డు పనిచేయక నిరుపయోగం

కృష్ణా: గన్నవరం మండలంలో నేషనల్ హైవే- 16 పై చిన్న అవుటుపల్లి ఆసుపత్రి సమీపంలో రహదారిపై ఏర్పాటు చేసిన డీస్ ప్లే బోర్డు పని చేయక నిరుపయోగంగా మారింది. ప్రమాదకరమైన ఈ ప్రదేశంలో నిత్యం ప్రజలు రోడ్లు దాటుతుండగా, బోర్డు పనిచేయకపోవడం రహదారి నిబంధనలపై అవగాహన లేకపోవడానికి దారితీస్తోంది. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.