కారు ఢీకొని వ్యక్తి మృతి

KMM: నేలకొండపల్లి మండల సమీపంలోని ఖమ్మం-కోదాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... రోడ్డు దాటుతున్న వ్యక్తిని అతివేగంగా వెళ్తున్న ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో.. అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.