పేదల సొంతింటి కల కాంగ్రెస్ తోనే నెరవేరింది: ఎమ్మెల్యే
SRPT: పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే నెరవేరిందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. గురువారం నాగారంలో చిప్పలపల్లి జయమ్మ ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశానికి హాజరై ప్రారంభించారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అందిస్తుందన్నారు. అనంతరం జయమ్మకు పట్టు వస్త్రాలు పెట్టి వారిని ఆశీర్వదించారు.