భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలు

WNP: చిట్యాల రోడ్డులోని డబల్ బెడ్ రూమ్ ఆదర్శనగర్ కాలనీలో ఇవాళ పోచమ్మ బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.పసుపు ,కుంకుమ, తోరణాలతో అలంకరించిన బోనం కుండలను మహిళలు తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ళ నడుమ ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యుడు బలరాం వెంకటేష్ పాల్గొన్నారు.