డాక్టర్ రామసుబ్బయ్యకు నివాళులర్పించిన ఎమ్మెల్యే
ATP: జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేసే సీనియర్ డాక్టర్ రామసుబ్బయ్య మరణించారు. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గురువారం డా. రామసుబ్బయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డాక్టర్ రామసుబ్బయ్య వైద్య వృత్తికి చేసిన సేవలను కొనియాడారు.