విజయ్ ఢిల్లీ పర్యటన.. అసలు కథేంటి?
తమిళనాట రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చెన్నైలో TVK పార్టీ అత్యవసర భేటీలో NDA కూటమిలో చేరేందుకు జిల్లా అధ్యక్షులు మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ క్రమంలో రేపు విజయ్ ఢిల్లీ పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ విచారణ కోసమేనా లేక రాజకీయ పొత్తుల కోసమా? అన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో పవన్ రాయబారం ఫలించబోతుందా అనేది వేచి చూడాలి.