తాడిపత్రిలో డ్రైడే ఫ్రైడే

అనంతపురం: తాడిపత్రిలో మున్సిపల్ అధికారులు డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది పట్టణంలో తన సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా, నీటి తోట్టెలలో నీరు ఎన్ని రోజుల నుంచి నిల్వ ఉంచుకున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.