పారిశుద్ధ్య లోపంతో ప్రజల ఇబ్బందులు

పారిశుద్ధ్య లోపంతో ప్రజల ఇబ్బందులు

మార్కాపురం జిల్లాలో డ్రైనేజీ కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. నాగులవరం రోడ్డు పాశంవారి వీధిలో కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయి, మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై మున్సిపల్ ప్రత్యేక అధికారి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.