'జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తాం'

KNR: జమ్మికుంట ప్రజలకు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గుడ్ న్యూస్ తెలిపారు. జిల్లాల్లో వాణిజ్య పరంగా అత్యంత కీలకమైన జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కరీంనగర్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసిన మాదిరిగానే జమ్మికుంట రైల్వేస్టేషన్‌ను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.