దుప్పితురులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి

దుప్పితురులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి

AKP: అచ్చుతాపురం మండల పరిధిలోని దుప్పితురు గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. సమాచారం ఆధారంగా ఎస్సైలు సుధాకర్, వెంకటరావు సిబ్బందితో కలిసి రైడ్ నిర్వహించారు. ఐదుగురు ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.53,620 స్వాధీనం చేసుకున్నారు. ఎస్సైలు ఈ విషయాన్ని ధృవీకరించారు.