అర్బన్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడి పూజ
NZB: ఇందూరు నగరంలోని DSN హోమ్స్‌లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఆ ప్రాంతమంతా అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగింది. భారీ ఎత్తున అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు, మహిళలు, ప్రజలు మహాపడి పూజలో పాల్గొన్నారు. రంగురంగుల పూలు, గణపతి, అయ్యప్ప, విగ్రహాలతో అందంగా అలంకరించారు.