ఆర్టీసీ డీలక్స్ బస్సు మహిళా ప్రయాణికులకు బహుమతుల ప్రధానం

HNK: హనుమకొండ-హైదరాబాదు రూట్లో ఆర్టీసీ డీలక్స్ బస్సులలో ప్రయాణించిన మహిళా ప్రయాణికులకు బహుమతులను ప్రధానం చేసినట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ డి విజయ భాను తెలిపారు. సోమవారం హనుమకొండ బస్టాండ్‌లో హనుమకొండ డిపో మేనేజర్ భూక్య ధరంసింగ్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించి విజేతలైన సానియాఅఖ్తర్, మల్లిక, జి పల్లవిలకు బహుమతులను అందజేశారు.