సమ్మె విరమించాలని మంత్రి విజ్ఞప్తి

సమ్మె విరమించాలని మంత్రి విజ్ఞప్తి

HYD: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ సమస్యలను పరిశీలించేందుకు అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికులు చర్చలకు రావాలని, ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా సహకరించాలని ఆయన కోరారు.