రావి చెట్టుకు స్థాన చలనం.. అధికారులు చర్య పై హర్షం

రావి చెట్టుకు స్థాన చలనం.. అధికారులు చర్య పై హర్షం

కోనసీమ: రావులపాలెంలో హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలు ఆక్రమణల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. తొలగింపు పనులకు అడ్డుగా ఉన్న పెద్ద రావి చెట్టును హైవే అధికారులు స్థానచలనం చేశారు. చెట్టును నరకకుండా మొదలుతో సహా బయటకు తీసి కడియపులంక నర్సరీకి తరలించారు. చెట్టును నాశనం చేయకుండా మరొక చోట నాటేందుకు తీసుకెళ్లిన అధికారుల చర్యను స్థానికులు మెచ్చుకుంటున్నారు