అలుగు పారుతున్న అడ్డాకుల పెద్ద చెరువు

అలుగు పారుతున్న అడ్డాకుల పెద్ద చెరువు

MBNR: జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల పెద్ద చెరువు చాలా సంవత్సరాల తర్వాత పూర్తిస్థాయిలో నిండుకుని అలుగు పారుతోంది. చాలా ఏళ్ల తర్వాత అలుగు పారుతుండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో చెరువు నిండుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.