తప్పుడు రిజిస్ట్రేషన్లు రద్దు

KMM: తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో చేయించుకున్న రిజిస్ట్రేషన్‌ను అధికారులు రద్దు చేశారు. ఖమ్మంలోని ఖానాపురం హవేలి పరిధిలోని విజయనగర్ కాలనీలోని స్థలాన్ని కొంతమంది వ్యక్తులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీస్టేషన్‌లో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.