VIDEO: మాజీ ఎమ్మెల్యే ఆరూరి ఇంటి వద్ద జనసందడి
HNK: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి తిరిగి చేరనున్నారు. ఈ మేరకు మంగళవారం హన్మకొండ ప్రశాంత్ నగర్‌లోని ఆయన నివాసానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మున్సిపల్ నోటిఫికేషన్ విడుదలతో జనసందడి మరింతగా పెరిగి, మాజీ ఎమ్మెల్యే నివాసం చుట్టూ ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.