తాత్కాలిక వంతెన నిర్మించుకున్న గ్రామస్తులు

తాత్కాలిక వంతెన నిర్మించుకున్న గ్రామస్తులు

ASR: అరకులోయ మండలం సిరగం పంచాయతీ పరిధిలోని డెర్ని-కప్పలు గొంది గ్రామాల మధ్య ఉన్న వంతెన మొంథా తుఫాన్‌లో కొట్టుకుపోయింది. ఈ వంతెనను స్థానిక గిరిజనులు వారంరోజుల పాటు శ్రమించి పెద్ద కర్రలతో తాత్కాలికంగా నిర్మించారు. ఈ వంతెనను వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనుల ఐక్యత, శ్రమను ప్రశంసించారు.