చివరి దశకు SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్

నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ చివరిదశకు చేరుకుంది. ఇప్పటికే టన్నెల్‌లో మట్టి, బురద తొలగింపు దాదాపుగా పూర్తయ్యింది. అయితే డేంజర్ జోన్ సమీపంలో సహాయక చర్యలపై ఇంకా స్పష్టత లేదు. గడిచిన 62 రోజుల నుంచి తొలగింపు పనులన్నీ వేగంగా జరుగుతున్నా.. మిస్స్ అయినా ఆరుగురి కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు.