మేడిపల్లిలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు

మేడ్చల్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పల్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ హైవే వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. పలు వాహనాలు తనిఖీలు చేసి పెండింగ్ చలాన్లు ఉంటే కట్టించారు. తప్పుడు నంబర్ కలిగిన కంప్రెసర్ ట్రాక్టర్‌ను సీజ్ చేసారు.