ఆల్‌ టైం హైకి గుడ్డు ధర

ఆల్‌ టైం హైకి గుడ్డు ధర

మహారాష్ట్రలో కోడి గుడ్ల ధరలు ఆకాశాన్నంటాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతోనే ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరాయి. ఛత్రపతి శంభాజీనగర్‌లో గుడ్ల హోల్‌సేల్ ధరలు ఒక్కొక్కటి రూ.8 చొప్పున పలుకుతోంది. ప్రస్తుతం రోజుకు 3 కోట్ల గుడ్ల డిమాండ్ ఉండగా.. సగం కూడా సరఫరా కావటం లేదని వ్యాపారులు తెలిపారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటుందని అంచనా.