'చెవిరెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే అన్నా'
ప్రకాశం: లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైసీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు పరామర్శించారు. చెవిరెడ్డి ఆరోగ్య పరిస్థితులు గురించి అడిగి తెలుసుకున్నారు. చెవిరెడ్డిని కలిసిన వారిలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, కనిగిరి ఇంఛార్జ్ దద్దాల నారాయణ ఉన్నారు.